Arshad Warsi: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు ఇన్ స్టాగ్రామ్ కామెంట్స్ ఆఫ్ చేసుకున్న అర్షద్ వార్సీ

Arshad Warsi disabled comments for a family pic in Instagram
  • కల్కి చిత్రంలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడన్న అర్షద్ వార్సి
  • అర్షద్ వార్సీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ 
  • ఫ్యామిలీ ఫొటో పోస్టు చేసి కామెంట్స్ డిసేబుల్ చేసిన బాలీవుడ్ నటుడు
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ ఓ జోకర్ లా ఉన్నాడంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అతడిని ఏకిపారేస్తున్నారు. 

సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు. నెటిజన్ల దెబ్బకు అర్షద్ వార్సీ ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యామిలీ ఫొటో పోస్టుకు కామెంట్స్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ స్టాగ్రామ్ లో తన కుటుంబ ఫోటో పోస్టు చేసిన అర్షద్ వార్సీ... ఆ పోస్టుపై ఎవరూ కామెంట్ చేయకుండా, కామెంట్స్ డిసేబుల్ చేశాడు. ఆ ఫొటోలో అర్షద్ వార్సీ తన భార్య, కుమార్తెతో కలిసి ఉండడం చూడొచ్చు. 

కాగా, ఈ పోస్టుకు కామెంట్స్ ఆఫ్ చేయడంతో నెటిజన్లు అర్షద్ వార్సీ ఇతర పోస్టులపై పడ్డారు. 

ప్రభాస్ బూటు అంత విలువ చేయదు నీ జీవితం అని ఒకరు... నీ ఆస్తి కంటే ప్రభాస్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 10 రెట్లు ఎక్కువ అని ఇంకొకరు... నువ్వు పెట్టుకోకూడని వాళ్లతో పెట్టుకున్నావు అంటూ మరొకరు... ఇండస్ట్రీ మొత్తమ్మీద నీకంటే పెద్ద జోకర్ ఎవరైనా ఉన్నారా?... వెంటనే ప్రభాస్ కు సారీ చెప్పు అంటూ మరో నెటిజన్... ఇలా అర్షద్ వార్సీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
Arshad Warsi
Prabhas
Joker
Kalki 2898 AD
Fans
Trolling
Social Media
Tollywood
Bollywood

More Telugu News