Palla Rajeshwar Reddy: తన మీద కేసు నమోదు కావడంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Palla Rajeshwar Reddy responded on case against him
  • ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • అన్ని అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడి
  • పాతికేళ్లలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరపలేదని స్పష్టీకరణ
తన మీద నమోదైన కేసు విషయమై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. తన పట్ల, తన విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము అన్ని అనుమతులతోనే నిర్మాణాలు జరిపామన్నారు. పాతికేళ్లలో ఎప్పుడూ అనుమతులు లేకుండా నిర్మించలేదన్నారు. తన విద్యా సంస్థలకు ఏఐసీటీఈ, జేఎన్టీయూ అనుమతులు ఉన్నాయన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీపై ఇరిగేషన్ శాఖ... పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెరువును కబ్జా చేసి ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీ నిర్మాణం చేపట్టారంటూ ఫిర్యాదు చేయడంతో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదయింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు.
Palla Rajeshwar Reddy
Telangana
BRS
Congress

More Telugu News