Govt Jobs: సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ

CISF Constable Recruitment Registration Starts On August 31
  • 1,130 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
  • ఈ నెల 31 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక
ఇంటర్ ఆపై చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం తాజాగా భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) లో 1,130 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్న దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 30 తో ముగియనుంది. ఇంటర్ పూర్తిచేసి 01.10.2001 నుంచి 30.09.2006 మధ్య కాలంలో పుట్టిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. పీఈటీ, పీఎస్‌టీ, సర్టిఫికెట్ పరిశీలన, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేలు రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.
Govt Jobs
CISF
Constable
Recruitment
Central Govt jobs
Job Notifications

More Telugu News