BSNL: చౌకైన 30 రోజుల ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్‌ఎల్‌... బెనిఫిట్స్ అదుర్స్!

BSNL Rs147 plan provides users with the convenience of unlimited calling and data
  • రూ.147కే నెలవారీ ప్లాన్ పరిచయం చేసిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ
  • అపరిమిత కాలింగ్‌తో నెలకు 10జీబీ డేటా లభ్యం
  • జియో, ఎయిర్‌టెల్, వీ కంపెనీలేవీ అందించని ఆకర్షణీయ ప్లాన్ ప్రకటన
ప్రైవేటు టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్-ఐడియా) టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచిన నేపథ్యంలో... ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ బీఎస్‌ఎన్ఎల్‌ అందిస్తున్న ఆఫర్ల పట్ల ఆకర్షితులవుతున్న కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండడంతో చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ముఖ్యంగా నెలవారీగా చౌకైన ప్లాన్లను అన్వేషిస్తున్న కస్టమర్లే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆకర్షణీయమైన 30 రోజుల ప్లాన్‌ను పరిచయం చేసింది.

బీఎస్ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ సరికొత్త ప్లాన్‌ ధర రూ.147గా ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఒక నెలంతా అపరిమిత కాలింగ్‌ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో నెల ప్లాన్‌ను పొందాలనుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఆఫర్‌గా కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీ వంటి ప్రముఖ టెలికం కంపెనీలేవీ ఇంత సరసమైన ధరకు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ను అందించడం లేదు.

ఇతర ప్రయోజనాలు ఇవే...

రూ.147 బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత కాలింగ్‌తో పాటు డేటా ప్రయోజనం కూడా పొందొచ్చు. కస్టమర్లకు నెలకు 10జీబీ డేటా లభిస్తుంది. దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు బీఎస్ఎన్ఎల్ కాలర్ ట్యూన్‌ సేవలను కూడా పొందొచ్చు. వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కాలర్ ట్యూన్‌లను సెట్ చేసుకోవచ్చు. పరిమిత డేటాతో అపరిమిత కాలింగ్ కోరుకునేవారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
BSNL
BSNL Offers
Mobile Recharge Offers
Telecom offers

More Telugu News