Kinjarapu Ram Mohan Naidu: విద్యాశాఖను తీసుకోవద్దని నారా లోకేశ్ కు చాలామంది చెప్పారు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu reveals so many told Nara Lokesh do not take up education ministry
  • లోకేశ్ విద్యాశాఖను ఓ సవాల్ గా తీసుకున్నారని వెల్లడి
  • రాష్ట్రం చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉందన్న రామ్మోహన్ నాయుడు
  • టీచర్లు కాస్త ఓపిక పట్టాలని సూచన
  • జీవో నెం.117 సహా అన్ని సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారని స్పష్టీకరణ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యా శాఖను తీసుకోవద్దని నారా లోకేశ్ కు చాలామంది చెప్పారని, కానీ ఆయన దాన్ని ఓ సవాల్ గా తీసుకుని విద్యాశాఖను చేపట్టారని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. లోకేశ్ విద్యాశాఖను మోజుతో కాకుండా, ఓ చాలెంజ్ గా స్వీకరించారని తెలిపారు. 

కొత్త ప్రభుత్వం వచ్చింది... ఇంకా సమస్యలపై స్పందించలేదు ఏంటని అనిపించవచ్చని, కానీ రాష్ట్రం చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, సచివాలయానికి వచ్చి చూస్తే రాష్ట్రం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 

టీచర్లు కొంచెం ఓపిక పట్టాలని, జీవో నెం.117 సహా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఉపాధ్యాయులకు అన్ని విధాలా గౌరవం ఇచ్చే నేత చంద్రబాబు అని కొనియాడారు. 

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ పీఆర్టీయూ యూనియన్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
Kinjarapu Ram Mohan Naidu
Nara Lokesh
Education Ministry
Teachers
TDP
Andhra Pradesh

More Telugu News