Darshan Thoogudeepa: కన్నడ నటుడు దర్శన్‌కు జైలులో రాజభోగాలు.. వీడియో కాల్‌లో ముచ్చట్లు!

Murderaccused actor Darshan now seen in video call from inside jail
  • అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా దర్శన్, నటి పవిత్ర గౌడ
  • ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్న నిందితులు
  • మొన్న జైలు లాన్‌లో మరికొందరితో కలిసి సిగరెట్ తాగుతూ సేదదీరిన నటుడు
  • ఇప్పుడు ఏకంగా వీడియో కాల్‌లోనే మాట్లాడిన దర్శన్
ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దర్శన్‌, నటి పవిత్రాగౌడ సహా 17 మంది ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో రిమాండులో ఉన్నారు. జైలులో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఒక దాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

మొన్న జైలు ఓపెన్ లాన్‌లో కొందరితో కలిసి కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ సేదదీరిన దర్శన్ ఫొటో వైరల్ కాగా, నిన్న ఎవరితోనో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి పసుపు టీ షర్ట్ ధరించిన వ్యక్తి నవ్వుతుండగా వీడియో మొదలైంది. ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి దానిని పట్టుకుని ముందుకు నడిచాడు. ఆ తర్వాత కెమెరాను తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. ఆ వెంటనే దర్శన్ ముఖం ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైంది. 

దర్శన్ నవ్వుతూ అతడిని విష్ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి మాట్లాడుతూ తిన్నావా? అని దర్శన్‌ను ప్రశ్నించాడు. అతడు నవ్వుతూ తిన్నానన్నట్టు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడుకుని బైబై చెప్పుకున్నారు. 

బయటకు వస్తున్న దర్శన్ వీడియోలు, ఫొటోలపై రేణుకాస్వామి తండ్రి శివగౌడ ఆవేదనగా స్పందించారు. నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులపైనా, న్యాయవ్యవస్థపైనా తనకు నమ్మకం ఉందని, దర్శన్ జైలులో రాజభోగాలు ఎలా అనుభవిస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Darshan Thoogudeepa
Pavithra Gowda
Parappana Agrahara Central Prison
Bengaluru
Renuka Swamy

More Telugu News