KTR: రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ: కేటీఆర్

KTR criticized that there are more families who shed tears than farmers who got loan waivers

  • అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడని కేటీఆర్ విమర్శ  
  • ఆగస్టు దాటుతున్నా రైతుభరోసా సాయం ఇంకా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
  • డెంగ్యూ మరణాల లెక్కలు ఎవరు, ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్

రైతు రుణమాఫీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడని మండిపడ్డారు. రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేదని, జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా డబ్బులు ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వెయ్యలేదని విమర్శలు గుప్పించారు. 

ఇక కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలేదని కేటీఆర్ ప్రస్తావించారు. రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలేదని, కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారంటూ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ షేర్ చేశారు.

డెంగ్యూ మరణాల లెక్కలపైనా విమర్శలు..
రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం తెలిపిందని, కానీ వార్తాపత్రికలు ముందు రోజు 5, ఇవాళ (సోమవారం) 3 మరణాలను రిపోర్ట్ చేశాయని కేటీఆర్ విమర్శించారు. డేటాను ఎవరు దాచారు, ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు లేవని, చాలా ఆసుపత్రుల్లో ముగ్గురు నలుగురు రోగులు ఒకే బెడ్‌ను షేర్ చేసుకుంటున్నారని ఆరోపించారు. తీవ్రమైన సమస్య ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఒప్పుకొని, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. పలు పత్రికల పేపర్ క్లిప్పింగ్స్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ షేర్ చేశారు.

  • Loading...

More Telugu News