Gold Rates: పెళ్లిళ్ల సీజన్‌లోనూ ఒడిదొడుకులు.. పెరగడానికి బదులు తగ్గుతున్న బంగారం ధర
- హైదరాబాద్ మార్కెట్లో నేడు స్వల్పంగా రూ. 10 తగ్గిన పుత్తడి ధరలు
- గత కొన్ని వారాలుగా బంగారం ధరల్లో ఊగిసలాట
- 24 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,030గా నమోదు
ఆషాఢం ముగిసి శ్రావణమాసం ప్రారంభమైన తర్వాత పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. శ్రావణం ప్రారంభంతోనే పెరగాల్సిన పుత్తడి ధరలు గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా 24 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 70 వేలకు అటూఇటుగా, 22 కేరెట్ల బంగారం ధర రూ. 66 వేలకు కాస్తంత అటూఇటుగా ఊగిసలాడుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ మార్కెట్లో నేడు పది గ్రాముల బంగారం ధర చాలా స్వల్పంగా రూ. 10 తగ్గింది. ఫలితంగా 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,030గా ఉండగా, 22 కేరెట్ల పుత్తడి ధర రూ. 66,940గా ఉంది. వెండి ధర కిలో రూ. 92,800గా నమోదైంది. ఈ ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా బంగారం ధరలు క్షణక్షణానికి మారుతుంటాయి కాబట్టి కొనుగోలు సమయంలో విచారణ తప్పనిసరి.