Women T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌... భార‌త జట్టు ప్ర‌క‌ట‌న‌!

India name Harmanpreet led squad for Women T20 World Cup
  • యూఏఈలో ఐసీసీ మహిళల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024
  • అక్టోబర్ 3 నుండి 20 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా వేదిక‌ల్లో టోర్నీ
  • గ్రూప్-ఏలో భార‌త్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక 
  • ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును తాజాగా ఎంపిక చేసిన బీసీసీఐ
యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ తాజాగా భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఈ మెగా ఈవెంట్‌లో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేసింది బోర్డు.  

షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ల‌తో భార‌త‌ బ్యాటింగ్ లైనప్ బ‌లంగా ఉంది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆశా శోభనా, సజన సజీవ‌న్‌ల‌తో బౌలింగ్ విభాగం కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. అటు హర్మన్‌ప్రీత్, సజన, శోభనా, దీప్తిలాంటి ఆల్‌రౌండర్లను టీమిండియా కలిగి ఉంది.

భార‌త జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్‌), తనూజా కన్వర్, సైమా ఠాకోర్.

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘ్వీ బిస్త్, ప్రియా మిశ్రా

కాగా, ఈ తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్ అక్టోబర్ 3 నుండి 20 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా వేదిక‌ల్లో జరగనుంది. గ్రూప్-ఏలో భార‌త్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఇక చివరి ఎడిషన్ టీ20 వరల్డ్ కప్‌లో కేప్‌టౌన్‌లో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
Women T20 World Cup 2024
Team India
Harmanpreet Kaur
Cricket
Sports News

More Telugu News