Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్‌కు అభినందనలు!: బండి సంజయ్

Bandi Sanjay congratulations Congress and its advocates for securing bail for Kavitha
  • కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు బండి సంజయ్ అభినందనలు
  • మీ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయంటూ చురక
  • ఈ బెయిల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమన్న బండి సంజయ్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయని చురక అంటించారు.

ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్... రెండు పార్టీల విజయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు వచ్చారని, ఇక కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళతారని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడానికి కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారన్నారు.
Bandi Sanjay
K Kavitha
Congress
BJP

More Telugu News