Abhishek Singhvi Manu: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవం
- నేటితో ముగిసిన నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ
- ఇండిపెండెంట్ పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణ
- దీంతో ఏకగ్రీవమైన అభిషేక్ మను సింఘ్వీ
తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణకు ఈరోజుతో గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్యేలు ఎవరూ బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో సింఘ్వీ ఏకగ్రీవమయ్యారు. సింఘ్వీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం తీసుకుంటారని తెలుస్తోంది.
సింఘ్వీ గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2006, 2018లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. ఇప్పుడు కేకే రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సింఘ్వీ ఏకగ్రీవమయ్యారు.