Earthquake: శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం

an earthquake struck ichchapuram in srikakulam district
  • ఇచ్చాపురం పరిసర ప్రాంతాలలో స్వల్పంగా భూ ప్రకంపనలు
  • వేకువ జాము 3.45 గంటల ప్రాంతంలో రెండు సెకనుల పాటు కంపించిన భూమి
  • భయంతో ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీసిన ప్రజలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరిగిందో కాసేపు అర్ధం కాక అయోమయానికి గురయ్యారు. భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 
Earthquake
Srikakulam District
ichapuram

More Telugu News