S Jagathrakshakan: డీఎంకే ఎంపీకి రూ. 908 కోట్ల భారీ జ‌రిమానా!

Rs 908 crore penalty in FEMA case against DMK MP S Jagathrakshakan by ED
  • అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్ జ‌గ‌త్ర‌క్ష‌క‌న్‌కు ఈడీ షాక్‌
  • 'ఫెమా' నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కేసులో ఈ భారీ జ‌రిమానా విధించిన ఈడీ
  • ప్ర‌స్తుతం అర‌క్కోణం నుంచి లోక్‌స‌భ‌ ఎంపీగా కొన‌సాగుతున్న జ‌గ‌త్ర‌క్ష‌క‌న్‌
త‌మిళ‌నాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.జ‌గ‌త్ర‌క్ష‌క‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రూ. 908 కోట్ల జ‌రిమానా విధించింది. 

విదేశీ మార‌క‌ద్ర‌వ్య నిర్వ‌హ‌ణ చ‌ట్టం (ఫెమా) నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కేసులో ఈ భారీ జ‌రిమానా విధించిన‌ట్లు ఈడీ స్ప‌ష్టం చేసింది. ఈ నెల 26వ తేదీన వ‌చ్చిన తీర్పుకు లోబడి ఈ చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది.  

ఇక ఫెమా చ‌ట్టంలోని 37ఏ సెక్ష‌న్ ప్ర‌కారం 2020 సెప్టెంబ‌ర్‌లో జప్తు చేసిన రూ. 89.19 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు ఉన్నాయని, ఈ మొత్తాన్ని కూడా జరిమానాలో కలిపినట్టు ఈడీ పేర్కొంది. 

ఇదిలాఉంటే.. వ్యాపార‌వేత్త అయిన జ‌గ‌త్ర‌క్ష‌క‌న్ ప్ర‌స్తుతం అర‌క్కోణం పార్ల‌మెంట్ స్థానం నుంచి లోక్‌స‌భ‌ సభ్యుడిగా కొన‌సాగుతున్నారు.
S Jagathrakshakan
FEMA
DMK
Enforcement Directorate

More Telugu News