Jogi Ramesh: వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేశ్ నియామకం

Jogi Ramesh appointed as YCP Mylavaram coordinator
 
ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ నాయకత్వం ఇన్చార్జిలను నియమించింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేశ్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలు జారీ చేశారని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇటీవలి ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దేవభక్తుని చక్రవర్తి గత ప్రభుత్వ హయాంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు.
Jogi Ramesh
Mylavaram
YSRCP
Devabhaktuni Chakravarti
Penapaluru

More Telugu News