Hero Ajith: గంటకు 234 కి.మీ.వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్.. వీడియో ఇదిగో!

Hero Ajith Driving Car At The Speed Of 234 KM Per Hour
  • ‘ఎన్నా స్పీడ్ తలా..’ అంటూ అభిమానుల కామెంట్లు
  • ఆడి కారులో కళ్లు చెదిరే వేగంతో అజిత్ డ్రైవింగ్
  • అభిమానులు అనుకరించే ప్రమాదం ఉందంటూ నెటిజన్ల విమర్శలు
కారు రేసింగ్ పై తనకున్న మక్కువను హీరో అజిత్ మరోసారి చాటుకున్నాడు. తన ఆడీ కారులో కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లాడు. ఏకంగా గంటకు 234 కిలోమీటర్ల వేగంతో అజిత్ కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను అజిత్ అభిమానులు షేర్ చేసుకుంటూ ‘ఎన్నా స్పీడ్ తలా.. (ఆ స్పీడ్ ఏంటి) అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, అంత స్పీడ్ తో అజిత్ కారు ఎక్కడ నడిపాడనే వివరాలు తెలియరాలేదు. అయితే, ఈ సంఘటన తప్పకుండా విదేశాలలోనే జరిగి ఉంటుందని అభిమానులు చెబుతున్నారు.

విదేశీ రోడ్లపై వాహనాలు గంటకు 150, 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లడం సాధారణమే. అక్కడి రోడ్ల నిర్మాణంలో ప్రత్యేకతల వల్ల ఆ వేగంతో వెళ్లడానికి వీలవుతుంది. కాగా, ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. బైక్, కార్ రేసింగ్ పై ఇష్టంతో అజిత్ ఇంటర్నేషనల్ ఎఫ్ఐఏ రేసింగ్ ఛాంపియన్ షిప్ లలో పాల్గొన్న విషయం గుర్తుచేశారు. ఆయన శిక్షణ పొందిన రేసర్ అనే విషయం తెలియని అభిమానులు ఆయనను అనుకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసి ఆయన అభిమానులు ఇండియన్ రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్ల రేస్ కు ప్రయత్నించే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు.
Hero Ajith
Car Drive
Car Race
234 KMPH
Viral Videos

More Telugu News