Bandi Sanjay: వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి లేఖ రాస్తా: బండి సంజయ్

Bandi Sanjay says will write letter to government
  • సిరిసిల్లలో మరణించిన రాజు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్
  • నేత కార్మికుల కరెంట్ విషయంలో ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సబ్సిడీ ఇస్తామని మోసం చేశాయని మండిపాటు
నేత కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తాను ప్రభుత్వానికి లేఖ రాస్తానని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. నేత కార్మికుల కరెంట్ విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మోసం చేశాయన్నారు.

నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశాయన్నారు. ప్రభుత్వానికి తాము సలహాలు, సూచనలు ఇస్తే తమపై నిందలు మోపుతున్నారన్నారు. నేత కార్మికుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందన్నారు.
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News