Srisailam: కృష్ణమ్మ ఉగ్రరూపం.. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్ల ఎత్తివేత

Srisailam and Nagarjuna Sagar dams filled with full water
  • భారీ వర్షాలతో మరోసారి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
  • నిండుకుండల్లా శ్రీశైలం, సాగర్ జలాశయాలు
  • గరిష్ఠ స్థాయికి చేరుకున్న నీటిమట్టాలు
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ మొత్తం 10 గేట్లను అధికారులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నేరుగా నాగార్జునసాగర్ కు చేరుతోంది. 

ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులుగా ఉండగా... ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

మరోవైపు శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ కూడా నిండుకుండలా మారింది. అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను ఎత్తవేయడంతో... ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
Srisailam
Nagarjuna Sagar
Dams

More Telugu News