Nalgonda: ప్రాణాల‌మీద‌కు తెచ్చిన‌ సెల్ఫీ మోజు... కాలువ‌లో ప‌డిన మ‌హిళ‌...!

Women Fell into Nagarjunasagar Canal while Taking Selfie in Nalgonda
  • న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌లంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద ఘ‌ట‌న‌
  • సెల్ఫీ దిగే క్ర‌మంలో కాలుజారి సాగ‌ర్ కాలువ‌లో ప‌డిపోయిన మ‌హిళ‌
  • వెంట‌నే స్పందించి మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడిన స్థానికులు
సెల్ఫీ మోజు ఓ మ‌హిళ ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వెంట‌నే స్పందించిన స్థానికులు మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడారు. 

స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... హైద‌రాబాద్ నుంచి మిర్యాల‌గూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం వేముల‌ప‌ల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ‌కాలువ వ‌ద్ద ఆగింది. అనంత‌రం ఆ కుటుంబం కాలువ వ‌ద్ద సెల్ఫీ దిగింది. ఈ క్ర‌మంలో ఆ ఫ్యామిలీలోని ఓ మ‌హిళ కాలు జారి కాలువ‌లో ప‌డిపోయింది. 

అది చూసిన స్థానికులు వెంట‌నే స్పందించి మ‌హిళ‌ను తాళ్ల సాయంతో కాపాడారు. మ‌హిళ సుర‌క్షితంగా పైకి రావ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో కొద్దిసేపు కాలువ వ‌ద్ద ఆందోళనకర వాతావర‌ణం నెల‌కొంది.
Nalgonda
Nagarjunasagar Canal
Selfie
Telangana

More Telugu News