arabian sea: తుపాన్ గా మారిన వాయుగుండం ..ఆస్నాగా నామకరణం
- వాయుగుండం.. తుపానుగా మారిందని వెల్లడించిన ఐఎండీ
- తుపానుకు అస్నాగా నామకరం చేసిన పాకిస్థాన్
- 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుపానుగా పేర్కొంటున్న అధికారులు
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం .. తుపానుగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో గుజరాత్‌లో కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ తుపానుకు పాకిస్థాన్ సూచించిన అస్నా అని పేరు పెట్టారు. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుపానుగా దీన్ని పేర్కొంటున్నారు.
కచ్ తీరం మీదుగా శుక్రవారం విస్తరించిన అస్నా తుపాను అరేబియా సముద్రంలోకి ఒమన్ దిశగా కదిలింది. మరో వైపు కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో గంటకు 50 కిలో మీటర్లవేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.