Plane Crash: ఇంటిపై కూలిన విమానం.. అమెరికాలో ముగ్గురు మృతి.. వీడియో ఇదిగో!

A Cessna crashed into a row of townhouses in America Three dead
  • విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఎగిసిపడ్డ మంటలు
  • నాలుగు ఇండ్లకు మంటలు వ్యాప్తి.. ఆరు ఫ్యామిలీలపై ప్రభావం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రమాద ఘటన వీడియోలు
టేకాఫ్ అయిన కాసేపటికే ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటన అమెరికాలోని ఫెయివ్యూ సిటీలో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫెయిప్యూ సిటీలోని టౌన్ హౌస్ ప్రాంతంలో  సెస్నా 421సీ విమానం ఇళ్లపై కూలిపోయింది. విద్యుత్ లైన్‌లను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.

మంటలు వ్యాపించడంతో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది.. విమానం ఎందుకు కూలిపోయిందనే వివరాలు తెలియరాలేదు. పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదని స్థానిక ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తెలిపారు.
Plane Crash
USA
Small plane
Fire Accident
Viral Videos

More Telugu News