Balakrishna: బాలకృష్ణ కెరీర్ కు 50 ఏళ్లు... రజనీకాంత్ స్పందన

Rajinikanth opines on Balakrishna 50 years career completion
  • బాలయ్య కెరీర్ కు గోల్డెన్ జూబ్లీ
  • నందమూరి నటసింహంపై శుభాకాంక్షల వెల్లువ
  • నా లవ్లీ బ్రదర్ అంటూ రజనీ ట్వీట్
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ కు 50 ఏళ్లు నిండిన సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, దక్షిణాది సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ కూడా బాలయ్యకు శుభాభినందనలు తెలిపారు. 

యాక్షన్ కింగ్, కలెక్షన్ కింగ్, డైలాగ్ డెలివరీ కింగ్ అంటూ కొనియాడారు. నా లవ్లీ బ్రదర్ బాలయ్య చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని, విజయోత్సాహంతో దూసుకుపోతున్నాడని వివరించారు. ఐదు దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా బాలయ్యకు హార్దిక అభినందనలు తెలియజేస్తున్నానని, చిరకాలం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
Balakrishna
Golden Jubilee
Rajinikanth
Wishes
Tollywood

More Telugu News