Kollu Ravindra: స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వరద సహాయ చర్యల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

AP minister Kollu Ravindra drove tractor in flood hit areas in Vijayawada
  • విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం
  • నగరంలోని పలు ప్రాంతాలు నీట మునక
  • చిట్టినగర్ లో పర్యటించిన మంత్రులు కొల్లు రవీంద్ర, అనిత, నారాయణ
  • బాధితులకు ధైర్యం చెప్పిన నేతలు
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) పర్యటించి, సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. 

ఈ సందర్భంగా చిట్టినగర్ లో మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ సహాయక చర్యలు చేపట్టారు. సహచర టీడీపీ నేతలను ట్రాక్టర్ పై ఎక్కించుకుని, ఆయన వరద నీటిలోనే ట్రాక్టర్ ను నడిపారు. 

కాగా, మంత్రులు మోకాలి లోతు నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. బుడమేరు వాగు పొంగి ఇళ్లలోకి నీరు చేరిన వైనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శిబిరంలో వరద బాధితులకు భోజన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Kollu Ravindra
Flood
Vijayawada
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News