Hawaii Shooting: అమెరికాలో దారుణం: వేడుక జరుగుతుండగా కాల్పులు.. ముగ్గురి మృతి

Four dead including suspect two others sustain injuries in Hawaii shooting
  • హవాయి రాష్ట్రంలోని వైయానేలో ఘటన
  • తొలుత ఇంటి బయటి కార్లను ఢీకొట్టిన నిందితుడు
  • నినితుడి కాల్పుల్లో ముగ్గురు మహిళల మృతి 
  • ఇంటి యజమాని కాల్పుల్లో నిందితుడి మృతి 
అమెరికాలో మరోమారు తుపాకి నిప్పులు కక్కింది. ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు కూడా తనను తాను కాల్చుకున్నాడు. హవాయి రాష్ట్రంలోని వైయానే అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరణించిన ముగ్గురూ మహిళలే కావడం గమనార్హం. 

నిన్న మధ్యాహ్నం ఓ ఇంట్లో వేడుక జరుగుతుండగా అక్కడ ఉన్న కార్లను ఢీకొట్టిన నిందితుడు అనంతరం వేడుక జరుగుతున్న ప్రాంతం పైకి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మహిళలు మరణించగా, మిగతా వారు అక్కడి నుంచి పరిగెత్తుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని జరిపిన కాల్పుల్లో నిందితుడు (58) అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడిని కాల్చి చంపిన ఇంటి యజమానిపై పోలీసులు సెకండ్ గ్రేడ్ మర్డర్ కింద అరెస్ట్ చేశారు. ఇరుగుపొరుగు వారి మధ్య గొడవలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తేల్చారు.
Hawaii Shooting
USA
Shooting

More Telugu News