Balakrishna: నాకు, చిరంజీవికి, నాగార్జునకు, వెంకటేశ్ కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది: బాలకృష్ణ

Healthy competition was there between actors says Balakrishna
  • ఘనంగా జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవం
  • అభిమానాన్ని పంచిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటానన్న బాలయ్య
  • అందరు హీరోల ఫ్యాన్స్ కలిసిమెలిసి ఉండాలని సూచన
బాలకృష్ణ సినీ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో స్వర్ణోత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నాని తదితర హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ... ఇండస్ట్రీలో తనకు, చిరంజీవికి, నాగార్జునకు, వెంకటేశ్ కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని తెలిపారు. ఒకరికి మించి మరొకరు ఫైట్లు, డ్యాన్సులు చేయాలని పోటీ పడేవాళ్లమని చెప్పారు. అందరు హీరోల అభిమానులు కలిసిమెలిసి ఉండాలని హితవు పలికారు.

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తనపై ఇంతటి అభిమానం పంచిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు దక్కాయని... వాటిలో తాను 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ఒకటని బాలయ్య చెప్పారు. 

తన కెరీర్ లో సాంఘికంగా, పౌరాణికంగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కిందని తెలిపారు. తాను నటించిన 'ఆదిత్య 369' చిత్రం భారత చిత్రసీమలోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ అని బాలకృష్ణ చెప్పారు. 


Balakrishna
Chiranjeevi
Nagarjuna
Venkatesh
Tollywood

More Telugu News