Undavalli: జగన్ చేసిన పెద్ద తప్పు ఇదే: ఉండవల్లి

Arresting Chandrababu is big fault of Jagan says Undavalli
  • చంద్రబాబును అరెస్ట్ చేయడం అతి పెద్ద తప్పు అన్న ఉండవల్లి
  • అధికారం మారేందుకు ఇదే బలమైన కారణం కావొచ్చని వ్యాఖ్య
  • చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి చంద్రబాబు అన్న ఉండవల్లి
చంద్రబాబును అరెస్ట్ చేయడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో అధికారం మారేందుకు అదే బలమైన కారణం అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు అంశాన్ని ప్రస్తావించారు. కక్షసాధింపు చర్యల వల్ల అధికారుల తీరు మారుతుందని... భవిష్యత్తులో సీఎంల మాట ఐపీఎస్ అధికారులు వినే అవకాశం ఉండదని అన్నారు. 

ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు రూ. 900 కోట్ల ఆస్తులను చూపించారని... చంద్రబాబు చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి అని ఉండవల్లి చెప్పారు. అయితే మార్గదర్శిపై మాత్రం చంద్రబాబు అభిమానం చూపారని తెలిపారు. 

మార్గదర్శి కేసు విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. ఈ నెల 11న మార్గదర్శి కేసు వాయిదా ఉందని... ఆ వాయిదాలో ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Undavalli
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News