Kangana Ranaut: 'ఎమర్జెన్సీ' సినిమా... కంగన రనౌత్‌‍కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు

MP high Court notices to Kangana

  • ఎమర్జెన్సీ సినిమాపై ప్రజాప్రయోజన వ్యాజ్యం
  • కంగనతో పాటు కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సెన్సార్ బోర్డులకు నోటీసులు
  • 24 గంటల్లోపు స్పందించాలన్న హైకోర్టు

ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా అంశంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు నోటీసులు ఇచ్చింది. కంగనతో పాటు కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సెన్సార్ బోర్డు, మణికర్ణిక ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంస్థలు, జీ స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఓ వర్గం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఈ నేపథ్యంలో అందులో ప్రధాన పాత్ర పోషించిన కంగన క్షమాపణ చెప్పాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు... ఈ నోటీసులపై 24 గంటల్లోపు స్పందించాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News