Drone: విజయవాడలో వరద బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం... వీడియో ఇదిగో!
- విజయవాడలో ఉప్పొంగిన బుడమేరు
- సింగ్ నగర్, తదితర ప్రాంతాలు నీట మునక
- రెండ్రోజులు గడుస్తున్నా తగ్గని వరద
- డ్రోన్ ద్వారా ఆహారం అందించే విధానాన్ని పరిశీలించిన చంద్రబాబు
విజయవాడలో బుడమేరు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. రెండ్రోజులు గడుస్తున్నా వరద తగ్గుముఖం పట్టకపోవడంతో, అజిత్ సింగ్ నగర్, తదితర కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఏపీ ప్రభుత్వం డ్రోన్ల సాయంతో ఆహారం అందిస్తోంది. ఇవాళ డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు సరఫరా చేసే విధానాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు వివరించిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం ఆమోదంతో, అధికారులు ఈ సాయంత్రం అజిత్ సింగ్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ పై ఉన్న ప్రజలకు డ్రోన్ ద్వారా ఆహారం అందించారు. ఫుడ్ ప్యాకెట్ సహా డ్రోన్ నిమిషం వ్యవధిలోపే అపార్ట మెంట్ పైకి చేరుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సోషల్ మీడియాలో పంచుకుంది.