Amit Shah: హైదరాబాద్ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా
- ఈ నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం
- అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవం నిర్వహణ
కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై రేపు (సెప్టెంబరు 3) పార్టీ నేతలతో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు.