Revanth Reddy: ప్రాణనష్టం తగ్గించగలిగాం: తెలంగాణలో వర్షాలు, వరదలపై రేవంత్ రెడ్డి

Revanth Reddy review on rains and floods in telangana

  • మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందని వెల్లడి
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్న సీఎం
  • పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి

భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాల్లో వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందిస్తామన్నారు. నష్టపోయిన 3 తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.

ఖమ్మంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామన్నారు. ఆక్రమణలను గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు.

  • Loading...

More Telugu News