Suresh Raina: నా ఫేవ‌రెట్ యాక్ట‌ర్‌ రామ్ చ‌ర‌ణ్.. ఆయ‌న యాక్టింగ్ డిఫరెంట్: సురేశ్ రైనా

RamCharan is on a Very Different Level Actor He his My Favourite says Suresh Raina
  • తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న టీమిండియా మాజీ ఆట‌గాడు 
  • ద‌క్షిణాది హీరోల్లో సూర్య అంటే ఇష్టమని చెప్పిన మాజీ సురేశ్ రైనా
  • తెలుగులో రామ్ చరణ్ డిఫరెంట్ యాక్టర్ అన్న మాజీ ప్లేయ‌ర్‌
టీమిండియా మాజీ ఆట‌గాడు సురేశ్ రైనాను అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌రిచిపోలేరు. త‌న‌దైన‌ మెరుపు ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సొంతం చేసుకున్న స్టార్ ప్లేయ‌ర్. అటు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ బెస్ట్ ఫ్రెండ్‌గా అత‌నికి పాప్యులారిటీ ఉంది. 

ఇప్ప‌టికే అన్ని ఫార్మాట్ల‌ క్రికెట్ కు వీడ్కోలు ప‌లికిన రైనాకు ఇంకా అభిమానుల్లో బాగానే క్రేజ్ ఉంది. ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న అత‌ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా రైనా త‌న ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకోవ‌డం జ‌రిగింది. 

ఈ క్ర‌మంలో అత‌నికి సినిమా హీరోల‌లో ఫేవ‌రెట్ ఎవ‌రనే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి రైనా త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు. ద‌క్షిణాది హీరోల్లో సూర్య అంటే ఇష్టమని తెలిపాడు. ఆ తర్వాత తెలుగులో రామ్ చరణ్ తన ఫేవరెట్ అని చెప్ప‌డంతో పాటు దానికి కార‌ణం కూడా తెలిపాడు. చెర్రీ త‌న‌ డిఫరెంట్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకుంటాడ‌ని, ఆయన చాలా డిఫరెంట్ యాక్టర్ అని చెప్పుకొచ్చాడు. 

రైనా త‌న ఫేవ‌రెట్ యాక్ట‌ర్ రామ్ చ‌ర‌ణ్ అని చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చెర్రీ అభిమానులు దీన్ని తెగ షేర్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.
Suresh Raina
Ramcharan
Team India
Tollywood

More Telugu News