Bandi Sanjay: తెలుగు రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని అమిత్ షాకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విజ్ఞప్తి

TG ministers requested Centre about ariel survey in Telangana
  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసిన తెలంగాణ నేతలు
  • విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
  • ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఏరియల్ సర్వే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. వారి విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియల్ సర్వేకు కేంద్రం సిద్ధమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈరోజే ఈ ప్రకటన వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. కేంద్రమంత్రి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం తెలుగు రాష్ట్రాల్లోని దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
Bandi Sanjay
G. Kishan Reddy
Amit Shah
Rains

More Telugu News