Nandigam Suresh: వైసీపీ నేతల అరెస్ట్ కు రంగం సిద్ధం... ఇంటి నుంచి పరారైన మాజీ ఎంపీ నందిగం సురేశ్

YSRCP Ex MP Nandigam Suresh escaped from home

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
  • ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
  • నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దేవినేని అవినాశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్ తదితరులు నిందితులుగా ఉన్నారు. 

ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వీరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని... అప్పటివరకు (రెండు వారాల పాటు) తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును వీరు కోరారు. ఈ విన్నపాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. 

ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమయింది. నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసేందుకు కాసేపటి క్రితం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు వస్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న సురేశ్... ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో, ఆయన ఇంటి వద్ద నుంచి పోలీసులు వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News