BJP: ఎంసీడీ వార్డు కమిటీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ షాక్

BJP wins big in MCD Ward Committee election

  • 12 జోన్‌లకు గాను 7 వార్డు కమిటీల్లో బీజేపీ విజయం
  • 5 వార్డు కమిటీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు
  • దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలు

మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) వార్డ్ కమిటీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. 12 జోన్‌లకు గాను 7 చోట్ల బీజేపీ విజయం సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ 5 వార్డు కమిటీలకు పరిమితమైంది. ఎంసీడీ వార్డు కమిటీ ఎన్నికలు నేడు ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో భారీ బందోబస్తు మధ్య జరిగాయి. 

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. 2022లో ఎంసీడీ ఏకీకరణ తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగాయి.

అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ ప్రతిష్ఠంభన కారణంగా ఈ ఎన్నికలు ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్ని ఎంసీడీ జోన్ల డిప్యూటీ కమిషనర్లను ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమించారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ ఎన్నికలు దాదాపు 19 నెలలు వాయిదా పడ్డాయి. ఆగస్ట్ 5న సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. సిటీ ఎస్పీ, కేశవ్ పురం నుంచి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఇక్కడ వార్డు కమిటీల ఏర్పాటుకు ఎన్నికలు జరగలేదు.

  • Loading...

More Telugu News