Gold Rates: 2 వారాల కనిష్ఠానికి పడిపోయిన బంగారం ధరలు
- మార్కెట్లో బలహీనంగా ట్రేడవుతున్న గోల్డ్
- నిన్న వరుసగా నాలుగో సెషన్లోనూ క్షీణించిన ధర
- ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధరపై రూ. 170 తగ్గుదల
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రాబోయే పాలసీ సమావేశంలో రేట్ల తగ్గింపు అవకాశం నేపథ్యంలో మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా సర్దుబాటు చేయడంతో వరుసగా నిన్న నాలుగో సెషన్లోనూ బంగారం ధరలు క్షీణించాయి. ఫలితంగా పుత్తడి ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి.
స్పాట్‌గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 2,486 డాలర్లకు చేరుకోగా, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్లు కూడా 0.2 శాతం పడిపోయి 2,518.30కు దిగొచ్చింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారంపై రూ. 170 తగ్గి రూ. 71,200కు పడిపోగా, కామెక్స్‌లో ఔన్స్ 9 డాలర్లు పడిపోయి ఔన్సు ధర 2,483కు క్షీణించింది. ఈ నెల 18న జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వు పాలసీ సమావేశంలో 0.50 బేసిస్ పాయింట్ రేటు తగ్గింపు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో గోల్డ్ బలహీనంగా ట్రేడ్ అవుతోంది.