MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు

TDP MLA Koneti Adimulam Suspended from Party


సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల‌ ఆరోప‌ణ‌లను తీవ్రంగా ప‌రిగ‌ణించిన టీడీపీ అధిష్ఠానం ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 

మ‌హిళ‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినందుకు పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఈ మేర‌కు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాసరావు ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల వీడియోను సదరు మహిళ మీడియా సమక్షంలో వెల్లడి చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News