Aerial Survey: విజయవాడ వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే

Union minister Shivraj Singh Chouhan takes aerial survey at Vijayawada flood hit areas
  • విజయవాడలో వరద బీభత్సం
  • ప్రధాని మోదీ సూచనలతో రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి
  • ఏపీ మంత్రి నారా లోకేశ్ తో కలిసి హెలికాప్టర్ లో వరద ప్రాంతాల పరిశీలన
  • జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రికి వివరించిన నారా లోకేశ్
ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ కు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వాగతం పలికారు. అనంతరం, హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారు. 

నారా లోకేశ్ తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ బుడమేరు క్యాచ్ మెంట్ ఏరియాలను, వరద ముంపు ప్రాంతాలైన జక్కంపూడి పాల ఫ్యాక్టరీ, కండ్రిక, సింగ్ నగర్ లను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. ఈ సందర్భంగా... వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని నారా లోకేశ్ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించారు.
Aerial Survey
Shivraj Singh Chouhan
Flood
Vijayawada
Andhra Pradesh

More Telugu News