Ollie Pope: 147 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త‌ రికార్డు.. చ‌రిత్ర సృష్టించిన‌ ఇంగ్లండ్ క్రికెట‌ర్!

Ollie Pope created history after making the 7th Test century of his career

  • తొలి 7 టెస్ట్ సెంచ‌రీల‌ను 7 వేర్వేరు జ‌ట్ల‌పై చేసిన క్రికెట‌ర్‌గా ఒలి పోప్‌
  • శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో శత‌కంతో అరుదైన రికార్డు
  • ద‌క్షిణాఫ్రికా, కివీస్‌, భార‌త్‌, శ్రీలంక‌, విండీస్‌, ఐర్లాండ్‌, పాక్‌పై పోప్ సెంచ‌రీలు

స్వ‌దేశంలో శ్రీలంక‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఒలి పోప్ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డును త‌న పేరున లిఖించుకున్నాడు. తన కెరీర్‌లో 49వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న పోప్‌.. తొలి ఏడు టెస్ట్ శ‌త‌కాల‌ను ఏడు వేర్వేరు జ‌ట్ల‌పై చేసిన తొలి క్రికెట‌ర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆఖ‌రిదైన మూడో టెస్టులో సెంచ‌రీ చేయ‌డం ద్వారా అత‌డు ఈ రికార్డును సాధించాడు. 

పోప్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు సాధించిన ప్రతి సెంచరీ ఆరు వేర్వేరు మైదానాల్లో చేయ‌డం మరో విశేషం. ఇక అతడు త‌న తొలి టెస్ట్ సెంచ‌రీని 2020లో దక్షిణాఫ్రికాపై సాధించాడు. ఆ తర్వాత నాటింగ్‌హామ్‌లో న్యూజిలాండ్‌పై రెండో శ‌త‌కం వచ్చింది. అలాగే మూడో సెంచ‌రీ రావల్పిండిలో పాకిస్తాన్‌పై చేశాడు

ఇక‌ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఐర్లాండ్‌పై పోప్ త‌న ఏకైక‌ డబుల్ సెంచరీ న‌మోదు చేశాడు. అలాగే హైదరాబాద్‌లో టీమిండియాపై 195 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఒక విదేశీ ఆటగాడు భారత గడ్డపై చేసిన గొప్ప నాక్‌లలో ఒకటిగా ఇది నిలిచింది. ప్ర‌స్తుతం శ్రీలంక‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌కు ముందు పోప్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో వెస్టిండీస్‌పై ఒక శ‌త‌కం న‌మోదు చేశాడు. 

ఇక టెస్టు క్రికెట్ ఆడే జ‌ట్ల‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్‌లపై మాత్ర‌మే పోప్ సెంచరీ చేయలేదు. దీనికి కార‌ణం పోప్ తన కెరీర్‌లో ఈ నాలుగు జ‌ట్ల‌తో ఇప్ప‌టివ‌ర‌కు ఆడక‌పోవ‌డ‌మే.

కాగా, పోప్ 49 టెస్టుల్లో 35.28 సగటుతో 2823 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలతో పాటు 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కు గాయం కార‌ణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ జ‌ట్టుకు దూరం అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ తాత్కాలిక సార‌థిగా ఒలి పోప్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

  • Loading...

More Telugu News