Sunita Williams: మరింత పెరిగిన ఉత్కంఠ.. సునీత, విల్‌మోర్ లేకుండా ఒంటరిగానే భూమికి స్టార్ లైనర్

Sunita Williams says goodbye to Starliner as it departs space station for Earth
  • 8 రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్
  • స్టార్ లైనర్‌ థస్టర్ ఫెయిల్యూర్, హీలియం లీక్ కావడంతో మిషన్ ఆలస్యం
  • ఫిబ్రవరి వరకు స్పేస్ స్టేషన్‌లోనే వ్యోమగాములు
  • గుడ్ బై టు స్టార్ లైనర్ అంటూ సునీత మెసేజ్
ఉత్కంఠను మరింత పెంచుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సరికొత్త బోయింగ్ ఆస్ట్రోనాట్ క్యాప్సుల్ స్టార్ లైనర్ ఈ ఉదయం భూమికి బయలుదేరింది. వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఇద్దరూ లేకుండా ఒంటరిగా బయలుదేరిన ఈ క్యాప్సుల్ మరో ఆరు గంటల్లో న్యూ మెక్సికో ఎడారిలో ల్యాండ్ కానుంది. ఎన్ఎస్ఎస్‌ నుంచి స్టార్ లైనర్ అన్‌డాక్ కావడానికి ముందు.. ‘దానిని తిరిగి భూమికి తీసుకెళ్లండి.. గుడ్ బై టు స్టార్‌లైనర్.. గుడ్‌లక్’ అని బోయింగ్ మిషన్ కంట్రోల్‌తో సునీత విలియమ్స్ చెప్పారు. 

సునీత, విల్‌మోర్ ఇద్దరూ నిజానికి 8 రోజుల మిషన్ కోసం జూన్‌లో అంతర్జాతీయ స్సేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్‌లో లోపాలు వారిని ప్రమాదంలోకి నెట్టేశాయి. థస్టర్ విఫలం కావడం, హీలియం లీక్ కావడంతో వారు అక్కడ చిక్కుకుపోయారు. దీంతో వారిని తీసుకురావడం ఎలానో తెలియక నాసా శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. అప్పటి నుంచి వారి రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వారిని సురక్షితంగా భూమికి తిరిగి రప్పించడంపై నాసా మల్లగుల్లాలు పడింది.

 చివరికి వారు లేకుండానే ఇప్పుడు స్టార్ లైనర్ వెనక్కి బయలుదేరింది. వస్తూవస్తూ పాత ఐఎస్ఎస్‌లో కొన్ని ఎక్విప్‌మెంట్స్‌ను మాత్రం మోసుకొస్తోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Sunita Williams
Butch Wilmore
ISS
Starliner
NASA

More Telugu News