Eye Of Brhama: బ్రహ్మ శపించిన వజ్రం.. భారత్ నుంచి బ్రిటన్‌కు ఎలా చేరింది?
మన దేశం నుంచి విదేశాలకు తరలిపోయిన వజ్రాల్లో ‘బ్రహ్మకన్ను’ డైమండ్ ఒకటి. దీనిని శాపగ్రస్థ వజ్రంగానూ పిలుస్తారు. ఆ తర్వాత దాని పేరు ‘బ్లాక్ ఓర్లోవ్‌గా మారింది. ఈ వజ్రం వెనక చాలా పెద్ద కథ ఉంది. ఓ ఆలయంలో బ్రహ్మ నుదిటిపై ఉన్న ఈ వజ్రాన్ని తొలుత ఓ సన్యాసి దొంగిలించాడు. ఆ తర్వాత అది అనేక మంది చేతుల్లో పడి ఎన్నో దేశాలు దాటింది.
అయితే, ఈ వజ్రాన్ని తొలుత దొంగిలించిన సన్యాసి సహా అది ఎవరి వద్ద ఉంటే వారు ప్రాణాలు కోల్పోయేవారు. దానిని ధరించిన రాజులు కూడా అకారణంగా మృతి చెందారు. దీంతో అత్యంత అరుదైన ఈ బ్రహ్మకన్ను వజ్రం కాస్తా శాపగ్రస్థ వజ్రంగా మారింది. మరి అదిప్పుడు ఎక్కడ ఉంది? ఏ రూపంలో ఉంది? అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.