Drugs: హైదరాబాద్ పబ్ లలో డ్రగ్స్

Drugs use in Hyderabad pubs Four Arrested
  • ఐదు పబ్బుల్లో అధికారుల సోదాలు
  • 33 మందికి డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్స్‌తో పరీక్ష
  • నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్న అధికారులు
హైదరాబాద్ లోని పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లిలోని ఐదు పబ్బులు, క్లబ్బులలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మొత్తం 33 మంది అనుమానితులకు డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని బేజీలోన్ పబ్, శేరిలింగంపల్లిలోని కోరం క్లబ్ సహా మొత్తం ఐదు పబ్ లలో అధికారులు సోదాలు చేశారు.

పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు అమ్మారనే వివరాలు రాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారు దొరికిన పబ్ లను అధికారులు సీజ్ చేశారు. వాటి యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Drugs
Pubs
Hyderabad
Jubilee Hills
Serilingampally
koram club

More Telugu News