T20 Blast 2024: బౌలర్‌తో సంబంధం లేని.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన నోబాల్.. వీడియో ఇదిగో!

Rarest No Ball in cricket world

  • 2024 విటాలిటీ టీ 20 బ్లాస్ట్‌లో ఘటన
  • సోమర్‌సెట్-నార్తాంప్టన్ షైర్ మధ్య మ్యాచ్‌లో అరుదైన నోబాల్
  • బౌలర్ బంతిని సంధించడానికి ముందే స్టంప్స్ దాటి బయటకు వచ్చిన కీపర్ చేతులు
  • రివ్యూ సమయంలో వెలుగులోకి నో బాల్ 

క్రికెట్‌లోనే అత్యంత అరుదైన నోబాల్ ఇది. సాధారణంగా బంతిని తప్పుగా సంధిస్తే అది నో బాల్ అవుతుంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అలాంటి ఇల్లీగల్ బంతికి బ్యాటర్‌కు ఫ్రీ హిట్ లభిస్తుంది. ఇక, క్రీజు దాటివచ్చి బంతిని సంధించడం, బ్యాటర్ నడుము ఎత్తుకు మించి బంతిని విసరడం వంటివి సాధారణంగా జరిగే తప్పులు. అలాగే, బౌలింగ్ యాక్షన్ వల్ల కూడా కొన్నిసార్లు నోబాల్స్ ప్రకటిస్తుంటారు. 

అయితే, ఈ నోబాల్‌తో మాత్రం బౌలర్‌కు సంబంధం లేదు. కీపర్ కారణంగా బౌలర్ ఖాతాలో నో బాల్ వచ్చి చేరింది. 2024 విటాలిటీ టీ 20 బ్లాస్ట్ సందర్భంగా సోమర్‌సెట్-నార్తాంప్టన్ షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యంత అరుదైన నోబాల్‌కు స్టేడియంలోని ప్రేక్షకులు సాక్షిగా నిలిచారు. బౌలర్ బంతి సంధించాక అది నేరుగా వెళ్లి కీపర్ చేతిలో పడింది. ఆ వెంటనే అతడు వికెట్లను గిరాటేశాడు. దానిని రివ్యూ చేస్తున్న క్రమంలో ఈ నోబాల్ బయటపడింది. 

బౌలర్ బంతి విసరడానికి ముందే కీపర్ తన చేతులను స్టంప్స్ కంటే ముందుకు పోనిచ్చాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం బంతి పడకుండానే కీపర్ గోవ్స్ స్టంప్స్‌ను దాటి రావడం నేరం. కీపర్ తన చేతులను స్టంప్స్ కంటే ముందుకు పోనివ్వడం రీప్లేలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. అలా వచ్చిన అవకాశాన్ని బ్యాటర్ చక్కని అవకాశంగా మార్చుకుని సిక్స్ కొట్టాడు.

  • Loading...

More Telugu News