Snake Bite: ఏనుగుల భయానికి ఒకే దగ్గర నిద్రపోయిన ముగ్గురు పిల్లలు.. పాముకాటుతో మృతి
- ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఘటన
- చప్కాలి గ్రామంలో ఇటీవల పెరిగిన ఏనుగుల దాడులు
- వాటి దాడి భయంతో కలిసి నిద్రపోయిన చిన్నారులను కాటేసిన కట్లపాము
ఏనుగుల దాడి భయంతో ఒకే దగ్గర కలిసి నిద్రపోయిన ముగ్గురు పిల్లలు పాము కాటుతో చనిపోయారు. ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో జరిగిందీ విషాదం. చప్కాలి గ్రామంపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు గురువారం రాత్రి ఇంట్లో ఒకే చోట నిద్రపోయారు. అదే సమయంలో వారింట్లోకి ప్రవేశించిన కట్లపాము నిద్రపోతున్న ముగ్గురినీ కాటువేసింది.
తల్లిదండ్రులు వారిని తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో గ్రామంలోని మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మూడో బాధితుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారులను పన్నాలాల్ కోర్వా (15), కంచన్ కుమారి (8), బేబీ కుమారి (9)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.