HYDRA: హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. ఆకట్టుకుంటున్న జాక్ క్రషర్.. ఏంటి దీని ప్రత్యేకత?

HYDRA Demolitions Continuous In Hyderabad Using Jack Crusher
  • వర్షాల కారణంగా వారం రోజులుగా స్తబ్దుగా హైడ్రా
  • నేటి తెల్లవారుజాము నుంచే మళ్లీ రంగంలోకి
  • కొనసాగుతున్న కూల్చివేతలు
  •  పెద్దపెద్ద భవనాలను సైతం చిటికెలో కూల్చేస్తున్న సరికొత్త హైడ్రాలిక్ జాక్ క్రషర్
వర్షాల కారణంగా గత వారం రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున మొత్తం 30 బృందాలు రంగంలోకి దిగాయి. దుండిగల్, మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, మియాపూర్, సర్ణపురి తదితర ప్రదేశాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అత్యంత అధునాతన హైడ్రాలిక్ జాక్ క్రషర్లు ఉపయోగించి కూల్చివేతలు జరుపుతున్నారు. 

మాలిక్ డిమాలిషన్ కంపెనీ ఈ కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతల్లో కనిపించిన అత్యాధునిక హైడ్రాలిక్ మిషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిని హైడ్రాలిక్ జా క్రషర్ అని పిలుస్తారు. ఇది అత్యంత శక్తిమంతమైనది. ఐదారు అంతస్తుల భవనాలను కూడా రెండుమూడు గంటల్లోనే నేలమట్టం చేసేస్తుంది. అంతేకాదు, ఉన్న చోటు నుంచే 10 అంతస్తులను అమాంతం కూల్చేయగలదు. 

ఇలాంటి అత్యాధునిక మిషన్లు దేశంలో నాలుగైదు మాత్రమే ఉన్నాయి. మాలిక్ సంస్థలో దాదాపు 500 మంది ఉద్యోగులున్నారు. 70 మంది ఆపరేటర్లు ఉన్నారు. ఈ మిషన్‌కు హైడ్రా ఒక్క రోజుకు దాదాపు రూ. 5 లక్షలు చెల్లిస్తున్నట్టు తెలిసింది. దాని ఆపరేటర్‌కే సంస్థ నెలకు రూ. 2 లక్షల వేతనం చెల్లిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
HYDRA
Hyderabad
FTL
HYDRA Demolitions

More Telugu News