Revanth Reddy: నేను అందరికీ నచ్చకపోవచ్చు... కానీ నా హోదాకైనా గౌరవం ఇవ్వాలి కదా!: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy interesting comments towards journalists
  • జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ
  • హైదరాబాదులో కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • జర్నలిస్టులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో జర్నలిస్టులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఓ వ్యక్తిగా నేను మీకు నచ్చకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఆ హోదాలో ఉన్న వ్యక్తి మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ప్రజలందరూ కలిసి ఆ హోదా ఇచ్చారు. ఆ హోదాను గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు, పత్రికా యజమానుల ముసుగులో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు ఉండదా? వాళ్లు పాటించనప్పుడు, మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy
Chief Minister
Journalists
Hyderabad
Congress
Telangana

More Telugu News