Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం... ఆ వ్యాపారవేత్తకు బెయిల్

Delhi HC grants bail to Businessman Sameer Mahendru
  • మనీలాండరింగ్ ఆరోపణలపై సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన ఈడీ
  • సమీర్ మహేంద్రు ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త
  • సమీర్ మహేంద్రుతో పాటు ఏఏపీ వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌కు బెయిల్ మంజూరు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రముఖ ఢిల్లీ వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై సమీర్ మహేంద్రును ఈడీ అరెస్ట్ చేసింది. వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురికి ఇప్పటికే బెయిల్ మంజూరు అయింది.
Delhi Liquor Scam
High Court
Congress
AAP

More Telugu News