Team India: సరిగ్గా ఇదే రోజున ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్.. ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఎందుకు రద్దయిందో తెలుసా?

India vs England Match Cancelled Due To Covid Outbreak In 2021 This Same Day
  • పటౌడీ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్
  • ఓల్డ్ ట్రాపోర్డ్‌లో ఐదు టెస్టు ప్రారంభానికి ముందు భారత శిబిరంలో కొవిడ్ కలకలం
  • మ్యాచ్‌ను రద్దు చేసి అభిమానులకు క్షమాపణలు
  • ఏడాది తర్వాత జులై 2022లో జరిగిన రీషెడ్యూల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం
సాధారణంగా ఏదైనా క్రికెట్ మ్యాచ్‌ను ఏదైనా కారణంతో రద్దుచేయాల్సి వస్తే కనీసం ఒక రోజు ముందైనా ప్రకటిస్తారు. కానీ, పటౌడీ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో  సరిగ్గా ఇదే రోజున జరగాల్సిన ఓ టెస్టు మ్యాచ్‌.. ప్రారంభానికి 90 నిమిషాల ముందు రద్దయింది. 2021లో సరిగ్గా ఇదే రోజున జరిగిందీ ఘటన. భారత క్యాంపులోని హెడ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు సపోర్టింగ్ స్టాఫ్ కరోనా బారిన పడడంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, భారత ఆటగాళ్లకు కొవిడ్ నిర్ధారణ కానప్పటికీ ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు అప్పటికే 2-1 ఆధిక్యంతో ఉండి ఇంగ్లండ్‌లో చారిత్రక విజయానికి దగ్గర్లో ఉంది. మ్యాచ్ జరిగితే తమ క్యాంపులోని ఆటగాళ్లు కూడా కరోనా బారినపడే అవకాశం ఉందని ఈసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో అభిమానులకు క్షమాపణలు చెప్పారు. రద్దయిన ఆ మ్యాచ్‌ను ఏడాది తర్వాత జులై 2022లో నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో భారత ఓటమి పాలు కావడంతో సిరీస్ డ్రా అయింది.
Team India
Team England
Pataudi Trophy
COVID19

More Telugu News