Sitaram Yechury: సీతారాం ఏచూరి నాకు ప్రియమిత్రుడు: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu said Sitaram Yechury was his dear friend
  • తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సీతారాం ఏచూరి
  • తమ మధ్య చక్కని స్నేహం వెల్లివిరిసిందన్న వెంకయ్యనాయుడు
  • ఆయన మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సీతారాం ఏచూరి కమ్యూనిస్టు భావజాలానికి ప్రతినిధి అయినప్పటికీ, తమ మధ్య చక్కని స్నేహం వెల్లివిరిసిందని తెలిపారు. సీతారాం ఏచూరి తనకు ప్రియమిత్రుడు అని వెల్లడించారు. ఇద్దరం ఎప్పుడు కలిసినా జాతీయ సమస్యల గురించే మాట్లాడుకునేవాళ్లమని వెంకయ్యనాయుడు వివరించారు. 

వక్తగా ఎంతో ప్రభావశీలి అని, స్పష్టత ఉన్న పార్లమెంటేరియన్ అని కొనియాడారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నానని, కానీ అంతలోనే మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.
Sitaram Yechury
Demise
Venkaiah Naidu
CPM
BJP
India

More Telugu News