Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసుల చార్జ్‌షీట్.. నిందితుల్లో నటి హేమ

Tollywood actress Hema name in Bengaluru rave party drugs case
  • మూడు నెలల క్రితం బెంగళూరు శివారులోని ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీ
  • దాడిచేసి 88 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
  • పార్టీలో పాల్గొన్న హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నారంటూ పోలీసుల చార్జ్‌షీట్
  • ఇదే కేసులో గతంలో అరెస్ట్ అయిన నటి హేమ
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ పేరు మరోమారు వెలుగులోకి వచ్చింది. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఆమెతోపాటు పార్టీలో పాల్గొన్న మరో 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు నిన్న 1,086 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ అభియోగ పత్రంలో ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్. వాసు యాజమాన్యంలోని ‘విక్టరీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ’ మూడు నెలల క్రితం బెంగళూరు శివారులోని హెబ్బగోడి జీఎం ఫాంహౌస్‌లో కంపెనీ తొలి వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అయితే, ఈ వేడుకను కాస్తా రేవ్ పార్టీగా మార్చేశారని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. పార్టీకి హాజరైన వారిలో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 

ఇదే కేసులో గతంలో అరెస్ట్ అయిన హేమకు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ కూడా విధించింది. ఆ తర్వాత కొన్ని షరతులతో ఆమెకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో జూన్ 14న బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు.
Bengaluru Rave Party
Actress Hema
Tollywood
Drugs Case

More Telugu News