ashoka emperor: జర్మనీలో సాంచి స్తూపం ప్రతిరూపం.. ఫొటో పోస్ట్ చేసిన విదేశాంగ మంత్రి

there are remains of ashoka emperor in germany external affairs minister jaishankar inspected
  • బెర్లిన్‌లోని ప్రసిద్ధ హంబోల్డ్ ఫోరమ్ (మ్యూజియం)ను సందర్శించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 
  • హంబోల్డ్ ఫోరమ్ వెలుపల ద్వారం వద్ద ఫొటోలు దిగి ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు చేసిన మంత్రి జైశంకర్
  • భారతదేశంలోని సాంచి స్తూపం యొక్క తూర్పు ద్వారానికి చెందిన ప్రతిరూపమే ఇది
జర్మనీ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. బెర్లిన్ లోని ప్రసిద్ధ హంబోల్డ్ ఫోరమ్ ను సందర్శించారు. ఇది మానవ చరిత్ర, కళ, సంస్కృతికి సంబంధించి వేల సంవత్సరాల చరిత్ర కల్గిన మ్యూజియం. ప్రపంచ సంస్కృతి, కళలను అర్దం చేసుకున్న కళాభిమానులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఈ హంబోల్డ్ ఫోరమ్ వెలుపల ఉన్న ద్వారం వద్ద జైశంకర్ ఫోటో దిగి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ఈ ద్వారం ప్రత్యేకత ఏమిటంటే .. భారతదేశంలోని సాంచి స్తూపం యొక్క తూర్పు ద్వారానికి చెందిన ప్రతి రూపం ఇది. జైశంకర్ తన బెర్లిన్ పర్యటన సందర్భంగా సాంచి స్తూపం ద్వారం యొక్క ఈ ప్రతిరూపాన్ని సందర్శించారు. దీన్ని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. 
 
భారతదేశంలో సాంచి స్తూపం మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం .. భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలోని బౌద్ధమతం యొక్క గొప్ప చరిత్ర, నాగరికతకు చిహ్నం. ఇది మూడవ శతాబ్దం క్రితం భారతీయ చక్రవర్తి అశోకుడి కాలంలో నిర్మితమైంది. అయితే.. తర్వాత పాలకులు దీనిని ధ్వంసం చేయగా.. మళ్లీ పునరుద్ధరించారు. దాదాపు 2700 ఏళ్ల తర్వాత కూడా అశోకుడి సందేశాలను ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. బెర్లిన్ లోని హంబోల్డ్ ఫోరమ్ లో సాంచి స్తూపం యొక్క తూర్పు ద్వారంతో విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు.  
ashoka emperor
Germany
external affairs minister jaishankar

More Telugu News