Sankranti 2025: నాలుగు నెలల ముందే సంక్రాంతి రైళ్లు ఫుల్

Sankranti Trains Reservations Filled In Just 5 Minutes
  • దసరా కూడా రాకుండానే రైళ్లన్నీ ఫుల్
  • విశాఖ, గోదావరి, కోణార్క్, ఫలక్‌నుమా రైళ్లకు నిన్న ఉదయం రిజర్వేన్లు ఓపెన్
  • కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌లు ఫుల్
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవలసిందే. దసరా కూడా రాకుండానే.. ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉండగానే హైదరాబాద్ నుంచి ఏపీకి దారితీసే రైళ్ల రిజర్వేషన్లు అన్నీ ఫుల్ అయ్యాయి.

వచ్చే ఏడాది జనవరి 11న హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్ తదితర రైళ్లకు నిన్న ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభం కాగా, కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే 8.05 గంటలకే మొత్తం బెర్త్‌లు నిండిపోయాయి. ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు నిరాశ తప్పలేదు. సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Sankranti 2025
Trains
Andhra Pradesh
Hyderabad

More Telugu News